లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించనున్న మలయాళీ భామ

లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించనున్న మలయాళీ భామ

టాలీవుడ్ లో యంగ్ హీరోలతో వరుసగా సినిమాలు చేసిన అనుపమ పరమేశ్వరన్ కి తెలుగులో అవకాశాలు తగ్గాయి. గత ఏడాది బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ రాక్షసుడు లో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా హిట్ అయినా అనుపమకు అంతగా అవకాశాలు రాలేదు. దీనితో ఆమె తమిళ, మలయాళ సినిమాలలో నటిస్తుంది. ఐతే ఆమెకు తెలుగులో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేసే అవకాశం దక్కిందని వార్తలు వినిపిస్తున్నాయి.

యంగ్ డైరెక్టర్ హనుమాన్ చౌదరి తెరకెక్కించనున్న ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ కోసం ఆమె సైన్ చేశారని వార్తలు వస్తున్నాయి. హనుమాన్ చౌదరి గతంలో నటుడు మరియు దర్శకుడు రవి బాబు తెరకెక్కించిన హారర్ థ్రిల్లర్ అవును సినిమాకు పనిచేశారు. ఈయన అనుపమ కోసం ఓ పవర్ ఫుల్ లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేశారని తెలుస్తుంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కలదు.