అనుష్క ఆ సమస్యల వల్లే ప్రమోషన్స్ కి వెళ్లట్లేదు.. ఏమైందో తెలుసా..?

అనుష్క ఆ సమస్యల వల్లే ప్రమోషన్స్ కి వెళ్లట్లేదు.. ఏమైందో తెలుసా..?
Latest News

అనుష్క శెట్టి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ కన్నడ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకుల్ని ఎప్పుడూ మెప్పిస్తూనే ఉంటుంది . తన నటనతో అమాయకత్వంతో అందర్నీ ఆకట్టుకుంటూ ఉంటుంది. అనుష్క శెట్టి బాహుబలి మూవీ తర్వాత పాన్ ఇండియా లెవెల్లో ఈమె మంచి స్టార్డం ఉన్న నటి. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో కూడా అనుష్క మనల్ని ఆశ్చర్యపరిచారు. బాహుబలి తర్వాత ఈమె కేవలం పాన్ ఇండియా సినిమా లే చేస్తుంది అని అంతా అనుకున్నాను. అనుష్క మాత్రం సైలెంట్ గానే ఉన్నారు.

అనుష్క ఆ సమస్యల వల్లే ప్రమోషన్స్ కి వెళ్లట్లేదు.. ఏమైందో తెలుసా..?
Anushka Shetty

పలు సినిమాల తర్వాత ఈమె ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉన్నారు. ఇప్పుడు తాజాగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ తో ప్రేక్షకులు ముందుకి వస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో ఈమె పాల్గొనలేదు. సైజ్ జీరో మూవీ కోసం బరువు పెరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుండి కూడా అదే ఫిజిక్ ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు . మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి లో కూడా ఈమె బొద్దుగానే ఉంటున్నారు. ఈ కారణంగానే ఆమె ప్రమోషన్స్ కి రావట్లేదు. అధిక బరువు సమస్య కారణంగానే ప్రమోషన్స్ కి రాలేకపోతోంది ఈ బ్యూటీ.