విరుష్క ఉండేది ఎక్క‌డ‌?

anushka sharma got married to Kohli then where she lives Mumbai or Delhi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

విరుష్క జోడీ ఒక్క‌ట‌వ్వ‌డంతో వారి ప్రేమ‌, పెళ్లి ఊహాగానాలకు తెర‌పడి… ఇప్పుడు వాళ్లిద్ద‌రూ క‌లిసి ఎక్క‌డ జీవించ‌బోతున్నార‌నేదానిపై… చ‌ర్చ మొద‌ల‌యింది. కోహ్లీ స్వ‌స్థ‌లం ఢిల్లీ. ఆయ‌న పుట్టి పెరిగిందంతా అక్క‌డే. అనుష్క బాలీవుడ్ లో హీరోయిన్ గా రాణిస్తూ ముంబైలో నివాస‌ముంటోంది. సంప్ర‌దాయం ప్ర‌కారం అయితే… భ‌ర్త ఇంటికి భార్య వెళ్లాలి. దాని ప్ర‌కారం అనుష్క కోడ‌లిగా ఢిల్లీలోని విరాట్ ఇంట్లో నివ‌సించాలి. అయితే… అనుష్క చానాళ్లుగా ముంబైలోనే ఉంటోంది. బాలీవుడ్ హీరోయిన్ గానే కాకుండా… ప్రొడ‌క్ష‌న్ హౌస్ ఓన‌ర్ గా చాలా బిజీగా ఉంటోంది. పెళ్లి త‌ర్వాత ఢిల్లీలో ఉంటే ఆమె త‌న కెరీర్, ప్రొడ‌క్ష‌న్ వ్య‌వ‌హారాలు చూసుకోవ‌డం కష్టం. విరాట్ వైపు నుంచి చూస్తే… ఆయ‌న ప్ర‌స్తుతం మంచి ఫామ్ లో ఉన్న క్రికెట్ కెప్టెన్. ఇంకా చాలా ఏళ్లు భార‌త జ‌ట్టుకు ఆడ‌నున్నాడు. ఎప్పుడూ ప‌ర్య‌ట‌న‌ల్లోనే ఆయ‌న స‌మయం గ‌డిచిపోతుంటుంది. కాబట్టి ఢిల్లీలో ఉన్నా, ముంబైలో ఉన్నా కోహ్లీకీ పెద్ద తేడా ఏమీ ఉండ‌దు. అందుకే విరాట్… భార్య కోసం ముంబై మకాం మార్చ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

ముంబైలో సంప‌న్నులు ఎక్కువ‌గా నివ‌సించే వ‌ర్లీలో కొత్త జంట కాపురం పెట్ట‌బోతోంద‌ని స‌మాచారం. ఇక విరుష్క పెళ్లి త‌ర్వాత అంద‌రికీ వ‌స్తున్న మ‌రో సందేహం విరాట్ భార్య హోదాలో అనుష్క హీరోయిన్ గా కెరీర్ కొన‌సాగిస్తుందా లేదా అని. గ‌తంలోనూ కొంత‌మంది క్రికెట‌ర్లు బాలీవుడ్ హీరోయిన్లను పెళ్లాడినా… వారంతా వివాహం త‌రువాత సినిమాల‌కు స్వ‌స్తి ప‌లికారు. ఈ త‌రం క్రికెటర్ల‌లోనూ యువ‌రాజ్ సింగ్ భార్య హ‌జీల్ కీచ్, హ‌ర్భ‌జ‌న్ సింగ్ భార్య గీతా బ‌స్రా, జ‌హీర్ ఖాన్ భార్య సాగ‌రిక వీరంతా పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉంటున్నారు. మ‌రి ఇండియ‌న్ క్రికెట్ కెప్టెన్ భార్య గా అనుష్క కూడా సినిమాల‌కు గుడ్ బై చెబుతుందా… లేక ఆ ప‌ట్టింపులేమీ లేకుండా… మున‌ప‌టిలానే కెరీర్ కొన‌సాగిస్తుందా అన్న‌ది వేచిచూడాలి. అటు శ్రీలంక‌తో వ‌న్డే, టీ 20 సిరీస్ ముగిసిన తర్వాత‌… టీమిండియా ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరి వెళ్ల‌నుంది. అయితే ఢిల్లీ, ముంబైల్లో వివాహ రిసెప్ష‌న్ త‌ర్వాత‌… టీమిండియా కంటే ముందు విరాట్ అనుష్క‌ను తీసుకుని ద‌క్షిణాఫ్రికా వెళ్ల‌నున్న‌ట్టు తెలుస్తోంది.

విరుష్క ఉండేది ఎక్క‌డ‌? - Telugu Bullet