మైనార్టీ స్టడీ సర్కిల్‌లో గ్రూప్-1 శిక్షణకు దరఖాస్తుల గడువు పెంపు

applications for group I training in minority study circle

మైనార్టీ స్టడీ సర్కిల్‌లో గ్రూప్-1 ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 20 వరకు గడుపు పొడిగించినట్టు మైనార్టీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ బీ షఫిఉల్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 22వ తేదీ నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొ న్నారు. దరఖాస్తులను అబిడ్స్‌లోని తెలంగాణ స్టేట్ మైనార్టీ స్టడీ సర్కిల్‌లో సమర్పించాలని కోరారు.