ముందువరుసలో ఉన్న ‘అర్జున్ సురవరం’

ముందువరుసలో ఉన్న 'అర్జున్ సురవరం'

నిఖిల్ సిద్దార్థ్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన అర్జున్ సురవరం చిత్రం నవంబర్ 29 న విడుదలకు సిద్ధంగా వున్నది. అయితే ఈ వారం చాల చిత్రాలు విడుదల అవుతున్నప్పటికీ ప్రతి ఒక్కరికి మైండ్ లో అలా అర్జున్ సురవరం ఫిక్స్ అయింది. అయితే ఈ చిత్రం ట్రైలర్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి ఇంతగా హైప్ రావడానికి కావడం మెగా స్టార్ చిరంజీవి అని చెప్పాలి. చిన్న సినిమాలు మరుగున పడిపోతున్న ఈరోజుల్లో, చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పిలిపించుకొని రావడం తో ఈ చిత్రం ఫై అమాంతం క్రేజ్ పెరిగింది.

అయితే ఈ చిత్రం ఆశించినదానికంటే ఎక్కువగానే ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. నిన్నటివరకు ప్రమోషన్స్ కూడా అంతగా లేని అర్జున్ సురవరం చిత్రం కథా బలం ఉంటే ఈ చిత్రాన్ని ఇంక ఎవరు ఆపలేరు అని ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే ఈ వారాంతం లో విడుదల అవుతున్న ఈ చిత్రం మిగతా చిత్రాలకంటే ముందువరుసలో ఉందని చెప్పాలి. మరి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా రెచ్చిపోతుందో చూడాలి.