అదిరిపోయే స్టెప్పులు వేస్తున్న బాలయ్య

అదిరిపోయే స్టెప్పులు వేస్తున్న బాలయ్య

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో “రూలర్” అనే ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి అందరికి తెలిసిందే.అలాగే బాలకృష్ణ కోసం ఏ చిన్న న్యూస్ వచ్చినా సరే అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యి తీరుతుంది.అది మంచైనా చెడైనా..ఇప్పుడు మరోసారి అలాంటి వార్తే ఒకటి మీ ముందుకు వచ్చింది.

ఇన్నేళ్లు అయినా సరే బాలకృష్ణ ఎనర్జీ మాత్రం ఒక్క ఇంచు కూడా తగ్గలేదని ఆయన సినిమాల్లోని డైలాగ్స్ కానీ ఇప్పుడున్న కుర్ర హీరోలు కూడా చెయ్యలేని డాన్స్ స్టెప్పులు కానీ చూస్తే అర్ధం అవుతుంది.అలా బాలయ్య అదిరిపోయే స్టెప్పులు వేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు బయటకొచ్చి వైరల్ అవుతుంది.

కోలీవుడ్ స్టార్ హీరో థలా అజిత్ నటించిన “వేదాళం”లోని హిట్ ట్రాక్ కు ఓ పార్టీలో బాలకృష్ణ వేసిన డాన్స్ స్టెప్పులు ఇప్పుడు ఆయన అభిమానుల్లో మంచి కిక్కెస్తున్నాయి.ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న రూలర్ చిత్రం వచ్చే డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది.ఓ సారి కిందున్న ఆ వైరల్ వీడియో క్లిప్ ను మీరు కూడా చూసెయ్యండి మరి.