బిహార్​లో హెలికాప్టర్ క్రాష్​

బిహార్​లో హెలికాప్టర్ క్రాష్​

ఆర్మీ ట్రైనర్​ ఎయిర్​క్రాఫ్ట్​ క్రాష్​కు గురవటం కలకలంగా మారింది. ఈ ప్రమాదం బిహార్​లోని బోధ్ ​గయా బ్లాక్​లో చోటు చేసుకుంది. కాగా, ఇండియన్​ ఆర్మీ ఆఫీసర్స్​.. ట్రైనింగ్​లో భాగంగా ఇద్దరు ట్రైనీలకు ఎయిర్​క్రాఫ్ట్​లో శిక్షణ నిస్తుంది. దీనిలో భాగంగా వీరు ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్​ గయా సమీపంలో కుప్పకూలింది. ట్రైనీ ఉద్యోగులు.. హెలికాప్టర్​ టెకాఫ్​కు ప్రయత్నించిన కొద్ది నిమిషాల్లోనే ప్రమాదం జరిగింది.

ఈ క్రమంలో.. హెలికాప్టర్​ అక్కడే ఉన్న పొలాల్లో దూసుకుపోయిందని సీనియర్ అధికారి తెలిపారు. కాగా, హెలికాప్టర్​​ కిందపడటాన్ని చూసిన గ్రామస్థులు వెంటనే సంఘటన స్థలానికి పరుగున వెళ్లి చేరుకున్నారు. హెలికాప్టర్ చిక్కుకున్న​ వారిని సురక్షితంగా బయటకు తీశారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, ట్రైనీలకు చిన్నపాటి గాయాలు మాత్రమే అయ్యాయని ఆర్మీ సిబ్బంది తెలిపారు. హెలికాప్టర్​ క్రాష్​కు గల కారణాలపై విచారణ చేపట్టామని తెలిపారు.