ఎంతటివారినైనా ఉపేక్షించవద్దు

ఎంతటివారినైనా ఉపేక్షించవద్దు

డ్రగ్స్ నిర్మూలనపై పోలీస్ ఎక్సైజ్ శాఖతో జరిపిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు‌. డ్రగ్స్ నియంత్రణ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించవద్దని, డ్రగ్స్ విషయంలో ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా సరే, నేరస్థులను కాపాడేందుకు ప్రజాప్రతినిధుల సిఫారసులను నిర్ద్వందంగా తిరస్కరించాలని సూచించారు.

దేశవ్యాప్తంగా విస్తృతమవుతున్న గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వాడకాన్ని తెలంగాణలో నుంచి కూడా సమూలంగా నిర్మూలించాలని అధికారులను ఆదేశించారు. సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని సామాజిక ఉద్యమంగా డ్రగ్స్ కంట్రోల్ సాధ్యమన్నారు.

1000 మంది సుశిక్షితులైన పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించుకుని అత్యాధునిక హంగులతో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్‌ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సదస్సులో రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, వి.శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.