‘హనుమాన్’ కోసం అంజనీపుత్రుడి ఆగమనం..!

‘హనుమాన్’ కోసం అంజనీపుత్రుడి ఆగమనం
Cinema News

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా యంగ్ హీరోయిన్ అమృత అయ్యర్ హీరోయిన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన భారీ మూవీ హను మాన్ కోసం అందరికీ తెలిసిందే. మరి మంచి బజ్ ఉన్న ఈ మూవీ ని మేకర్స్ ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా ప్రమోట్ చేస్తుండగా ఈ మూవీ విషయంలో మాత్రం మొదటి నుంచి అందరిలో ఒకింత ఆసక్తిని రెట్టింపు చేసిన అంశాల్లో ఈ మూవీ కి మెగాస్టార్ చిరంజీవి ఫ్యాక్టర్ కూడా ఒకటి.

‘హనుమాన్’ కోసం అంజనీపుత్రుడి ఆగమనం
Hanuman Movie..!

ప్రస్తుతానికి అయితే ఈ మూవీ లో మెగాస్టార్ ప్రెజెన్స్ ఉందా లేదా అనేది సస్పెన్స్ గా ఉంది కానీ మూవీ కోసం మెగాస్టార్ ప్రెజెన్స్ ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది. మేకర్స్ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మెగాస్టార్ చిరంజీవి వస్తున్నట్టుగా టాక్ బయటకి వచ్చింది. ఇక దీనిపై మేకర్స్ అఫీషియల్ గా అప్డేట్ ని ఇచ్చేసారు.

ఈ జనవరి 7న గ్రాండ్ గా జరిగే తమ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి వస్తున్నట్టుగా మేకర్స్ ఇప్పుడు ప్రకటించారు. దీనితో హను మాన్ కోసం చిరంజీవుడి ఆగమనం ఖరారు అయ్యింది అని చెప్పాలి. మరి ఈ ఈవెంట్ లో ఎలాంటి విషయాలు తాను పంచుకుంటారో అనేది చూడాల్సి ఉండి .