జూనియర్ నటుడిని రేప్ చేసిన హీరోయిన్ !

asia argento accused of sexual assault

అదేదో సినిమాలో అన్నట్టు ఆకు వెళ్లి ముల్లు మీద పడ్డా, ముల్లొచ్చి ఆకు మీద పడ్డా చిరిగేది ఆకేనని. ఒక స్త్రీ లైంగిక వేధింపులకి గురయినా పురుషుడి మీదే నేరం మోపుతారు, అలాగే ఒక మహిళ రివర్స్ లో ఎవరినైనా లైగికంగా వేధించినా ఆమె స్త్రీ అనే ఏకైక కారణంతో అబ్బే అదేమీ లేదని ఆమెనే వెనకేసుకు వస్తారు. మనమందరం అలాంటి సమాజంలో బతుకుతున్నాం. కానీ ఇప్పటి వరకు వెలుగులోకి రాని సంఘటన ఒకటి ఇప్పుడు కలకలం రేపుతోంది. అదేంటంటే ఇటీవలి కాలంలో మనం క్యాస్టింగ్ కౌచ్ అనే మాట తరచూ వింటూనే ఉన్నాం, అంటే సినిమా అవకాశాల కోసం స్త్రీలను శారీరికంగా వాడుకోవడం. అయితే ఈ విషయం మీద భోజ్ పూరి నటుడు రవి కిషన్ ఒక సంచలన ఆరోపణ చేసాడు అదేంటంటే తనను ఒక లేడీ ప్రొడ్యుసర్ లైంగికంగా వేధించింది అని. అయితే అప్పుడు చాలా మంది అతని మాటలు నమ్మ లేదు. కానీ తాజాగా అలాంటి విషయమే ఒకటి వెలుగులోకి వచ్చింది.

asia argento

అదేంటంటే అసలు క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమం మొదలయిన మీటూ క్యాంపెయిన్ లో కీలక పాత్ర పోషించిన ఒక హాలీవుడ్ హీరోయిన్ తన తోటి యువ నటుడు, సంగీత దర్శకుడు అయిన జిమ్మీ బెనేట్ మీద అత్యాచారం చేసిందనే వార్త హాలీవుడ్ అంతా దావానలంలా వ్యాపించింది. అతను పదిహేడేళ్ళ వయసులో ఉన్నప్పుడు అంటే దాదాపు ఐదేళ్ళ క్రితం హాలీవుడ్ హీరోయిన అయిన ఏషియా అతన్ని ఒక హోటల్ లో రేప్ చేసిందని వార్తలు వస్తున్నాయి. ఇద్దరు కలిసి ఒకే సినిమా షూట్ కోసం వెళ్ళినప్పుడు ఒకే హోటల్ లో బస చేయాల్సి వచ్చిందని అప్పుడు సదరు హీరోయిన్ తో సేల్ఫీ దిగేందుకు ఆమె గదికి వెళ్ళగా అప్పుడు ఒంటరిగా ఉన్న ఆమె జిమ్మీ మీద అఘాయిత్యానికి పాల్పడింది అని తెలుస్తోంది. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా ఏషియా అతడికి రూ.2.50 కోట్లు వాయిదాల్లో చెల్లించినట్లు కొన్ని డాక్యుమెంట్లు అంతర్జాతీయ మీడియాలో వెలువడ్డాయి.

sexual assault