తమిళనాడులో దారుణం.. ఏనుగు నోట్లో పేలిన నాటు బాంబు..!

Atrocious in Tamil Nadu.. A bomb exploded in the elephant's mouth.
Atrocious in Tamil Nadu.. A bomb exploded in the elephant's mouth.

తమిళనాడులో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆరేళ్ల ఆడ ఏనుగు నోటిలో నాటు బాంబు పేలింది. దీంతో ఏమి తినలేక ఆకలితో అలమటించి ప్రాణాలను వదిలింది. తమ పొలాల్లోకి అడవి పందులు రాకుండా నిరోధించడానికి అవుత్తుకై అని పిలిచే బాంబును ఇక్కడి స్థానికులు కూరగాయాలు ,పండ్లల్లో పెట్టి వుంచుతారు. ఏదైనా జంతువు దానిని కొరికినప్పుడు ఆ బాంబు పేలి, ఆ జంతువు నోటికి తీవ్ర గాయమవుతుంది. ఈ నేపథ్యంలో తడగాం అటవీ రేంజ్‌లోని ఇటుక బట్టీ సమీపంలోని స్థానికులు ఏనుగు సంచరిస్తోందని అటవీ అధికారులను అప్రమత్తం చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

సమాచారం అందుకుని ఆ ఘటనాస్థలికి అధికారులు, పశువైద్య బృందం చేరుకుని తీవ్ర గాయంతో బాధపడుతున్న ఏనుగుకు గ్లూకోజ్, ఇంట్రావీనస్ మెడిసన్ అందించారు. ఈ క్రమంలో నిషేధిత ‘‘అవుట్టుకై’’ అనే నాటు బాంబును ఏనుగు కొరికినట్లుగా పశువైద్య బృందం గుర్తించింది. ఇటీవలే కేరళ అటవీ ప్రాంతంలో నుంచి తమిళనాడులోకి బాధిత ఏనుగు ప్రవేశించినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఎక్కడ ఈ బాంబు ఏనుగుకి కొరికిందో తెలుసుకునేందుకు అధికారులు విచారణ చేపట్టారు.