బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కి ఈడీ సమన్లు..!

ED summons to Bollywood hero Ranbir Kapoor..!
ED summons to Bollywood hero Ranbir Kapoor..!

దేశవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో క్రికెట్ బెట్టింగ్ రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరూ బెట్టింగ్ వలలో పడుతున్నారు. చాలా మంది యువకులు డబ్బులను పోగొట్టుకుంటున్నారు. కొంత మంది ఆస్తులను సైతం కోల్పోతున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో మహదేవ్ క్రికెట్ బెట్టింగ్ యాప్ కి రణబీర్ కపూర్ ప్రచార కర్తగా పని చేశారని ఈడీ సమన్లు జారీ చేసింది.

అక్టోబర్ 06న విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. వారం కిందట వైజాగ్ లో 10 మందిని కూడా పోలీసులు అరెస్టు చేశారు . మహదేవ్ యాప్ వేల కోట్ల బిజినెస్ చేస్తుంది. దీంతో యువకులు కోట్ల రూపాయలు ఆస్తులను పోగొట్టుకుంటున్నారు యువకులు. కొంతమంది ప్రాణాలను కోల్పోయినట్టు కూడా సమాచారం. ఈడీ రణబీర్ కపూర్ ఈనెల 06న ప్రశ్నించనుంది. బెట్టింగ్ యాప్ కి ప్రచారం చేయడానికి కారణమేంటి..? ప్రచారం చేయడం వల్ల ఎం లాభం ఉంది అనే కోణంలో విచారించే అవకాశం కనిపిస్తోంది. అక్టోబర్ 06న రణబీర్ కపూర్ హాజరు అవుతారా లేదా అనేది వేచి చూడాలి మరీ.