40 ఏళ్ల వయసులో పెళ్లికి రెడీ అయిన శింబు.. అమ్మాయి ఎవరంటే ?

40 ఏళ్ల వయసులో పెళ్లికి రెడీ అయిన శింబు.. అమ్మాయి ఎవరంటే ?
Latest News

కోలీవుడ్ స్టార్ హీరో శింబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇతను కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ మూవీ ల్లో కూడా నటించాడు. ఇతను ఎన్నో సినిమాల్లో నటించడమే కాకుండా తమిళ సినిమాలకు సంగీతం కూడా అందించారు. 40 పదుల వయసు వచ్చినప్పటికీ శింబు ఇంకా వివాహం కూడా చేసుకోలేదు. ఇతను పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం గతంలో రెండు సార్లు ప్రేమ విఫలం కావడంతో అసలు వివాహం చేసుకోలేదు .

40 ఏళ్ల వయసులో పెళ్లికి రెడీ అయిన శింబు.. అమ్మాయి ఎవరంటే ?
Simbhu

స్టార్ హీరోయిన్ నయనతార ప్రేమలో విఫలమయ్యాడు. ఆ తర్వాత హన్సికతో చాలా రోజులు రిలేషన్ మెయింటైన్ చేశాడట. దాదాపు వీరిద్దరి ప్రేమ పెళ్లి పీటల వరకు వెళ్ళింది. కానీ ఏమైందో తెలియదు మళ్ళీ వీరిద్దరూ విడిపోయారు. దీంతో శింబు పెళ్లికి దూరంగా ఉంటున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా శింబు తండ్రి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక చాలా రోజులకి శింబు వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి ఓకే చెప్పారట. శింబు ఓ సిని ఫైనాన్షియర్ కూతురిని వివాహం చేసుకోబోతున్నాడట.