మంచు విష్ణు “కన్నప్ప” నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్.!

మంచు విష్ణు “కన్నప్ప” నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్.!
Cinema News

మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు . ప్రస్తుతం మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాలో నటిస్తున్నారు . అవా ఎంటర్టైన్ మెంట్ అండ్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా ని నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది బాలీవుడ్ టెలివిజన్ రంగంలో సూపర్ హిట్ మహాభారత సిరీస్ ని డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమా కి దర్శకత్వం వహించబోతున్నాడు.

మంచు విష్ణు “కన్నప్ప” నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్.!
Kannappa

ఈ సినిమాలో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ తేడా లేకుండా స్టార్ హీరోలను, నటులను దింపేశారు . అయితే మంచి విష్ణు భక్తకన్నప్ప గా, ప్రభాస్ శివుడిగా నటిస్తున్న కన్నప్ప సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయింది. మంచు విష్ణు బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ భారీ బడ్జెట్ మూవీ ప్రస్తుతం న్యూజిలాండ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. మోహన్లాల్ మరియు శివరాజ్ కుమార్ కూడా ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.