ఇంతకీ శ్రీదేవి మరణానికి కారణం ఏంటి ?? సీక్రెట్ బయటపెట్టిన భర్త

ఇంతకీ శ్రీదేవి మరణానికి కారణం ఏంటి ?? సీక్రెట్ బయటపెట్టిన భర్త
Latest News

నటి శ్రీదేవి గురించి తెలియని వారుండరు. ఇండియా అంతటా అతిలోకసుందరిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటి శ్రీదేవి గారు . ఎన్నో సినిమాలలో ఎందరో గొప్ప గొప్ప నటులతో కలిసి నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. తన అద్భుతమైన నటన, అమాయకత్వం, డ్యాన్స్ తో ఎంతోమంది ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. ఇక తన నటనకుగాను ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇక శ్రీదేవి మన మధ్య లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. ఈమె మరణవార్త తెలిసి చాలామంది ప్రేక్షకులకు గుండెలు పగిలాయి. తన మరణాన్ని చాలామంది అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. శ్రీదేవి మరణం ఓ మిస్టరీగా మారింది.

ఇంతకీ శ్రీదేవి మరణానికి కారణం ఏంటి ?? సీక్రెట్ బయటపెట్టిన భర్త
Boney Kapoor, Sridevi

తనది సహజమరణం కాదని ఎవరో కావాలని హ**త్య చేశారని ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ ఆ వార్తలపై ఇప్పటికి తన కుటుంబ సభ్యులు ఎవరు స్పందించలేదు. ఇక తాజాగా తన భర్త బోనీ కపూర్ శ్రీదేవిది సహజమరణం కాదని ప్రమాదవశాత్తు చనిపోయిందని చెప్పుకొచ్చాడు. 2018లో శ్రీదేవి తన కుటుంబ సభ్యుల వివాహానికి దుబాయ్ కి వెళ్ళింది. అక్కడే బాత్రూం లో జారిపడి మరణించింది. ఇక శ్రీదేవి మరణానికి తన భర్తనే కారణం అంటూ చాలా వార్తలు వచ్చాయి. ఇక ఈ విషయాలపై ఇప్పటివరకు స్పందించని బోనీకపూర్ తాజాగా ఒక నేషనల్ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీదేవి ప్రమాదవశాత్తు మరణించింది.