ధనుష్ చిత్రంలో సహాయ దర్శకుడి మృతి!

ధనుష్ చిత్రంలో సహాయ దర్శకుడి మృతి!
Cinema News, Latest News

లేటెస్ట్ గా తెలుస్తున్న సమాచారం ప్రకారం కోలీవుడ్ లో ఒక విషాద వార్త అందరినీ తీవ్ర దుఃఖం లోకి ముంచి వేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే అసిస్టెంట్ డైరెక్టర్ మారిముత్తు హఠాత్తుగా మరణించారు . ధనుష్ హీరోగా చేసిన కర్ణన్ మరియు ఉదయనిధి స్టాలిన్ లేటెస్ట్ గా నటించిన మమన్నాన్ చిత్ర లకు దర్శకత్వం వహించిన సెల్వరాజ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఇక సెల్వరాజ్ తెరకెక్కించిన మూడు సినిమాలకు ఇతను అసిస్టెంట్ గా పనిచేశాడు. అయితే నిన్న మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం సిగరెట్ తాగుతుండగా సడెన్ గా దగ్గు రావడంతో ఊపిరి ఆడక బాధపడినట్లు తెలుస్తుంది . అయితే అక్కడ ఉన్న సిబ్బంది మరిముత్తును హాస్పిటల్ కు తీసుకువెళుతుండగా మార్గ మధ్యంలోనే చనిపోయినట్లు తెలుస్తుంది .

 ధనుష్ చిత్రంలో సహాయ దర్శకుడి మృతి!
Dhanush Movie

కానీ పోలీసులు సమాచారం అందుకుని ఈ మృతిని అనుమానాస్పదంగా నోట్ చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు . మరి ఈ మృతిలో ఎవరి హస్తం ఏమైనా ఉందా అన్నది తెలియాల్సి ఉంది .