జూ. ఎన్టీఆర్ “దేవర” నుండి స్పెషల్ అప్డేట్ !

జూ. ఎన్టీఆర్ “దేవర” నుండి స్పెషల్ అప్డేట్ !
movie News

టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ చిత్రం దేవర షూటింగ్ లో చాలా బిజీ గా ఉన్నాడు. ఈ మూవీ ను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం కొరటాల శివ ఈ మూవీ కు సంబంధించిన ఒక అప్డేట్ ను ఎన్టీఆర్ అభిమానుల కోసం చెప్పారు. దేవర మూవీ ను రెండు పార్ట్ లుగా విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ లో ఉందట. అందుకు అనుగుణంగానే షూటింగ్ ను ప్లాన్ చేసుకున్నారట. ఇందులో మొదటి పార్ట్ ని 2024 ఏప్రిల్ 5న అంటే వేసవి సెలవుల సంధర్భంగా రిలీజ్ చేయనుండగా, రెండవ పార్ట్ ని ఎప్పుడు విడుదల చేస్తారన్నది ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు. ఇక కొరటాల సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తిని మరింత పెంచడానికి కోస్టల్ ప్రాంతాలలో తీసిన వీడియోను కూడా రిలీజ్ చేశారట.

జూ. ఎన్టీఆర్ “దేవర” నుండి స్పెషల్ అప్డేట్ !
NTR “Devara ” Movie

కాగా ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కు ఇటీవల ఆర్ ఆర్ ఆర్ సినిమాకు గాను ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. దీనితో ఎన్టీఆర్ పై మరింత బాధ్యత పెరిగింది.