యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్టీవో ఆఫీస్ కి ఎందుకు వెళ్ళాడో తెలుసా ..?

Do you know why young tiger NTR went to RTO office..?
Do you know why young tiger NTR went to RTO office..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) చివరిసారిగా జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన రౌద్రం రణం రుధిరం (RRR) మూవీ లో కనిపించారు. ఈ మూవీ తో వరల్డ్ వైడ్ గా సూపర్ క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న దేవర (Devara) మూవీ లో ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్నారు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ లో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.

Do you know why young tiger NTR went to RTO office..?
Do you know why young tiger NTR went to RTO office..?

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఖైరతాబాద్ లో ఆర్టీవో ఆఫీస్ కు వెళ్ళారు. తను కొన్న కొత్త కారు రిజిస్ట్రేషన్ కోసం ఎన్టీఆర్ ఆర్టీవో ఆఫీస్ కు వెళ్ళారు. ఇందుకు సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ దేవర మూవీ తో పాటుగా, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమా లో కనిపించనున్నారు. ఈ మూవీ కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.