మారిపోయిన చిన్నారి పెళ్లి కూతురు… అవకాశాలు కష్టమే

Avika Gor New look for movie Offers

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన అవికా గౌర్‌ను ‘ఉయ్యాల జంపాల’ చిత్రంతో తెలుగు సినిమా పరిశ్రమకు తీసుకు వచ్చారు. తెలుగులో హీరోయిన్‌గా నటించిన మొదటి సినిమానే మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో అవికా నటించింది. పలు సక్సెస్‌లు అందుకున్న అవికా గౌర్‌ కొన్ని నెలలుగా సినిమాలకు దూరంగా ఉంటుంది.

Avika Gor New look

బొద్దుగా ఉంది అంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో అవిగా గ్యాప్‌ తీసుకుని మరీ నాజూకుగా తయారు అయ్యింది. దాదాపు పది కేజీల బరువు తగ్గిన అవికా గౌర్‌ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అంటూ ప్రకటించింది. తాజాగా ఒక ఫొటో షూట్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు మరియు తమిళంలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుంది. మరో వైపు హిందీలో సీరియల్స్‌కు కూడా ట్రై చేస్తోంది.

దాదాపు ఆరు నెలలుగా సినిమాలకు దూరంగా ఉన్న అవికా గౌర్‌కు మళ్లీ ఛాన్స్‌ ఇచ్చేందుకు ఏ ఒక్క నిర్మాత ఆసక్తిగా లేడు. యువ హీరోలు ఈమెతో నటించాలని అప్పుడు అనుకున్నారు. కాని ఇప్పుడు ప్రేక్షకులు అంతా మర్చిపోయారు. ఈమె వల్ల చేసినా కూడా ప్రయోజనం లేదు అని కొందరు భావిస్తున్నారు. అందుకే ఈమెకు మళ్లీ సినిమాల్లో అవకాశాలు వస్తాయా లేదా అనేది కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాని చిన్నారి పెళ్లి కూతురు అవికా మాత్రం తాను మళ్లీ బిజీ అవుతాను అనే నమ్మకంతో ఉంది.