ఫాన్స్ సరదాపై పవన్ ఫైర్… జగన్ కి కోపం.

Pawan kalyan fires on Fans in vizag meeting Then Jagan angry on him

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఫాన్స్ మీద ఫైర్ అవ్వడం అందుకు వైసీపీ జగన్ కి కోపం రావడం ఎవరైనా ఊహించగలరా ? ఇదేదో మోకాలికి బోడిగుండుకు ముడి పెట్టే వ్యవహారం కాదు. నిజంగా నిజం. విశాఖ పర్యటనకు వచ్చిన పవన్ వివిధ ప్రజాసమస్యలు, ప్రభుత్వాలు ఆడి తప్పిన మాటల మీద ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఆయన ఆవేశపూరితంగా ప్రసంగిస్తుంటే పవన్ కళ్యాణ్ ఫాన్స్ కొందరు ఓ చోట చేరి కాబోయే సీఎం , పవన్ సీఎం కావాలి అంటూ పెద్దగా నినాదాలు ఇస్తూ హల్ చెల్ చేశారు. దీంతో కాస్త డిస్టర్బ్ అయిన పవన్ కళ్యాణ్, ఫాన్స్ ని ఉద్దేశించి ఘాటుగా కామెంట్ చేశారు. సీఎం పదవి అంటే మీకు సరదా ఏమో గానీ నాకు కాదు, ఆ పదవి కావాలంటే చాలా అనుభవం కావాలి అని పవన్ కామెంట్ చేయడంతో ఫాన్స్ సైలెంట్ అయ్యారు.

పవన్ అన్న ఈ మాటలు అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ కి కోపం తెప్పించాయట. 2019 ఎన్నికల్లో సీఎం కుర్చీ టార్గెట్ గా తాను పాదయాత్ర చేస్తుంటే పవన్ అనుభవం గురించి మాట్లాడడం పరోక్షంగా తనను తగ్గించి, బాబుని పెంచడానికే అని జగన్ ఫీల్ అయిపోయారంట. ఈ మాటే 2014 లో తన అవకాశాలను దెబ్బ తీసిందని, ఇప్పుడు మరోసారి అదే మాట ముందుకు రావడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారట. అందుకే తన ఫాన్స్ సరదా మీద ఫైర్ అయిన పవన్ అంటే జగన్ కి కోపం వచ్చింది.