నేడు ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్‌పై అవగాహన

Awareness of eamcet web counselling

హైదరాబాద్: మాజీ సైనికుల పిల్లలకు ఎంసెట్ ఇంజినీరింగ్ వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియ గురించి సమగ్రంగా వివరించేందుకు సోమవారం ప్రత్యేకంగా అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు ప్రాంతీయ సైనిక సంక్షేమాధికారి నోరి శ్రీనేష్‌కుమార్ తెలిపారు. సోమాజిగూడ యశోద దవాఖాన సమీపంలోని సైనిక ఆరాంఘర్ కాంప్లెక్స్‌లో ఉదయం 9:30 గంటల నుంచి సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. వెబ్‌కౌన్సిలింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది, ఆన్‌లైన్‌లో ఆప్షన్లను ఎలా ఎంచుకోవాలి, సీఏపీ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది, ఏఏ డాక్యుమెంట్లు అవసరం అన్న అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఇతర వివరాల కోసం 8790738657 నెంబర్‌ను సంప్రదించాలన్నారు.