మెగా హీరో కోసం బాలయ్య, చిరు కూడా!

balakrishna and chiranjeevi attended for vijetha movie audio function

మెగాస్టార్‌ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ హీరోగా తెరకెక్కిన ‘విజేత’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈనెల 24న ఆడియో విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఆడియో విడుదలకు మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్న విషయం అందరికి తెల్సిందే. అయితే ఇదే వేడుకకు బాలకృష్ణ కూడా హాజరు కాబోతున్నట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ‘విజేత’ చిత్రాన్ని నిర్మించిన సాయి కొర్రపాటికి బాలకృష్ణకు చాలా కాలంగా సన్నిహిత సంబంధాలున్నాయి. వీరిద్దరి కలయికలో ‘లెజెండ్‌’ చిత్రం వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఎన్టీఆర్‌ చిత్ర నిర్మాణ బాధ్యతను సాయి కొర్రపాటికి బాలకృష్ణ అప్పగించిన విషయం తెల్సిందే. అందుకే సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ‘విజేత’ చిత్రం ఆడియో విడుదలకు బాలకృష్ణ వస్తాడని సమాచారం అందుతుంది.

ఒకే వేదిక మీదకు నందమూరి, మెగా హీరోలు రావడం చాలా చాలా అరుదు. చాలా సంవత్సరాల తర్వాత మెగా మరియు నందమూరి హీరోలు ఒకే వేదిక మీద కనిపించబోతున్నారు. ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణలు ఒకే వేదికపైకి రాబోతున్న నేపథ్యంలో మీడియా వర్గాల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. విజేత మూవీ ఆడియో విడుదల లైవ్‌ హక్కులకు ప్రస్తుతం భారీగా డిమాండ్‌ ఉంది. ఆడియో విడుదల కార్యక్రమంను భారీ ఎత్తున లైవ్‌ ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చిరంజీవి మరియు బాలకృష్ణల చేతుల మీదుగా ‘విజేత’ ఆడియో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు ఆకాశానికి తాకేలా ఉన్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే నెలలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.