సమరానికి సిద్ధమైన బాలయ్య…

Balakrishna Jai Simha movie details

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

యువ హీరోల కంటే ఫాస్ట్ గా నందమూరి బాలకృష్ణ వరుసుగా సంవత్సరానికి 2 లేక 3 సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు. తన తోటి హీరోలు అయిన నాగార్జున, వెంకటేష్ మరియు చిరంజీవి కూడా ఇంత స్పీడ్ గా సినిమాలు తీయలేకపోతున్నారు. ఇప్పటివరకు బాలకృష్ణ 101 సినిమాలలో నటించాడు. ఇప్పుడు 102 సినిమా తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘జై సింహ’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్య సరసన నయనతార, నటాషా జోషి, హరిప్రియలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘సింహ’ సెంటిమెంట్ బాలయ్యకు బాగా కలిసి వచ్చింది, అందుకే ఈ సినిమాలో టైటిల్ లో కూడా ‘సింహ’ ఉండేటట్లు చూసుకున్నాడు బాలయ్య…

‘జై సింహా’ మూవీ శుక్రవారంతో దుబాయ్ షెడ్యూల్ పూర్తి చేసుకొంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ… జానీ మాస్టర్ నేతృత్వంలో‘దుబాయ్ లో 30 మంది యూరోపియన్ డ్యాన్సర్స్ తో బాలయ్య-నటాషా ల మధ్య డ్యూయోట్ సాంగ్ మరియు బృంద మాస్టర్ నేతృత్వంలో 20 మంది యూరోపియన్ డ్యాన్సర్స్ తో బాలయ్య నయనతారలపై మరో లవ్లీ సాంగ్ ను చిత్రీకరించామని. ఈ రెండు పాటలతో ఈ మూవీ చిత్రీకరణ పూర్తయిందని… డిసెంబర్ నెలాఖరుకు ‘జై సింహ’ పాటలను విడుదల చేసి, బాలయ్య సెంటిమెంట్ నెల జనవరిలో సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘జై సింహా’ చిత్రాన్ని విడుదల చేయనున్నాం అని ప్రకటించారు. ‘జై సింహ’ లో బాలయ్య ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ కి బాలకృష్ణ ఫ్యాన్స్ ఫిదా అవ్వటం గ్యారంటీ… నయనతారలపై – నటాషా లపై వచ్చే రొమాంటిక్ పాటలు ఈ సినిమాకు హైలైట్ నిలుస్తాయని, కె.ఎస్.రవికుమార్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడని,’ ఈ సందర్భంగా కళ్యాణ్ అన్నారు.