ఎన్టీఆర్ , చరణ్ తో బన్నీ బాక్సింగ్.

allu arjun competes charan and ntr multistarrer movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్ లో మోస్ట్ సెన్సేషనల్ మూవీగా ఫిలిం నగర్ కోడై కూస్తోంది రాజమౌళి తలపెట్టిన మల్టి స్టారర్. ఎన్టీఆర్ , చరణ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా నేపధ్యం బాక్సింగ్ అని ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి దాదాపు ఆరేడు నెలలు పట్టొచ్చు. అంతకన్నా ఎక్కువ టైం పట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ , చరణ్ కి వున్న కమిట్మెంట్స్ దృష్టితో చూసి వేసిన అంచనా ఇది. కానీ ఒక్కసారి రాజమౌళి పూర్తి స్థాయిలో రెడీ అయిపోతే ఈ ఇద్దరూ కొన్ని త్యాగాలు చేసి అయినా ఈ సినిమా కోసం ముందుకు వస్తారు. రాజమౌళి సినిమాకి వాళ్ళు ఇచ్చే విలువ అది.

allu-arjun
సహజంగా బాక్సింగ్ నేపథ్యంలో రాజమౌళి సినిమా అనగానే ఇంకోరు ప్రస్తుతానికి ఆ బ్యాక్ డ్రాప్ వైపు ఆలోచించరు. కానీ బన్నీ మాత్రం అదే నేపథ్యంలో ఓ సినిమా ఓకే చేసినట్టు తెలుస్తోంది. అను కె . రెడ్డి అనే కొత్త దర్శకుడు చెప్పిన స్క్రిప్ట్ బన్నీకి పిచ్చపిచ్చగా నచ్చిందట. అందుకే ఆ సినిమాలో హీరోగా మాత్రమే కాదు కుదిరితే సొంత బ్యానర్ పెట్టి ప్రొడ్యూస్ చేయాలని కూడా ఉబలాటపడుతున్నారట. ఇది కాకతాళీయంగా జరుగుతోందా లేక చరణ్ , ఎన్టీఆర్ లతో పోటీ ఫీల్ అవుతున్న బన్నీ కావాలనే ఈ అటెంప్ట్ చేస్తున్నాడా అన్న సందేహాలు కూడా రాకపోవడం లేదు. బాహుబలి తరువాత రాజమౌళితో సినిమా చేయబోయే హీరోల జాబితాలో బన్నీ పేరు కూడా వినిపించింది. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్ , చరణ్ కాంబినేషన్ మూవీ సెట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురి మీద పోటీకి బన్నీ బాక్సింగ్ నేపథ్యంలో సినిమా ఎంచుకోవడమే కాకుండా వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే లో షూటింగ్ మొదలు పెట్టే ఛాన్స్ ఉందట. బన్నీ ప్లాన్ చూసి ఆయన ఎన్టీఆర్ , చరణ్ తో బాక్సింగ్ చేస్తున్నాడని ఫిలిం నగర్ లో సరదాగా అనుకుంటున్నారు.