ప్రయోగం అవసరమా బాలయ్య?

Balakrishna Looking For New Actors In NTR Biopic

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నందమూరి బాలకృష్ణ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అయిన ‘ఎన్టీఆర్‌’ త్వరలో పట్టాలెక్కబోతుంది. తేజ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని చేయాలని మొదట భావించినప్పటికి ఈ చిత్రాన్ని చివరకు క్రిష్‌కు అప్పగించాడు. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు ఉంటారని అంతా భావించారు. కాని ఈ చిత్రంలో ఎక్కువ శాతం కొత్త వారు ఉంటారు అని తేలిపోయింది. ఎందుకంటే ఈ చిత్రం కోసం కాస్టింగ్‌ కాల్‌కు బాలయ్య పిలుపునిచ్చాడు. అన్ని వయస్సుల వారు కూడా తమ ఫొటోలతో పాటు చిన్నపాటి వీడియోను పంపించాలంటూ కాస్టింగ్‌ కాల్‌లో పేర్కొనడం జరిగింది. కొత్త వారితో సినిమా అంటే అది ఖచ్చితంగా ప్రయోగమే. మరి అలాంటి ప్రయోగంను బాలయ్య ఎందుకు చేస్తున్నాడు అంటూ సినీ వర్గాల వారు ప్రశ్నిస్తున్నారు. తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ను ఇలా ప్రయోగాత్మకంగా అంటూ కొత్త వారితో చేసే ప్రయత్నం చేస్తే మొత్తానికి మోసం వచ్చే అవకాశం ఉందని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఎన్టీఆర్‌ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం అనగానే పర్వాలేదు అని అంతా భావించారు. కాని అనూహ్యంగా ఇప్పుడు బాలయ్య కొత్త వారితో పలు పాత్రలు చేయించాలని భావిస్తున్న నేపథ్యంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవలే వచ్చిన బయోపిక్‌ ‘మహానటి’లో అంత పాతవారే కనిపించారు. ఆ పాత్రల్లో ఒదిగి పోయినట్లుగా ఉండటం వల్ల కూడా సినిమాకు ప్లస్‌ అయ్యింది. కొత్త వారిని తీసుకుంటే వారి నుండి నటన రాబట్టుకోవడం కత్తిమీద సాము. ముఖ్య పాత్రల్లో తెలియని వారు కనిపిస్తే సినిమా వెయిట్‌ తగ్గుతుందని కొందరు హెచ్చరిస్తున్నారు. దాదాపు 15 నుండి 20 మంది కొత్త నటీనటులకు ఛాన్స్‌ ఇచ్చేందుకు బాలయ్య కాస్టింగ్‌ కాల్‌ ఇచ్చాడు. మరి దీనికి ఎంత మంది రియాక్ట్‌ అవుతారు, ఎంపిక అయిన వారు ఎలా ఆకట్టుకుంటారో అనేది చూడాలి