ఎన్టీఆర్‌తో నేను కూడా అంటున్న చరణ్‌!

Ram Charan six pack for Boyapati Seenu Film

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ‘అరవింద సమేత’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఆ సినిమాను దసరా కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం జరిగింది. ఫస్ట్‌లుక్‌తోనే ఎన్టీఆర్‌ సిక్స్‌ ప్యాక్‌తో ఈ చిత్రంలో కనిపించబోతున్నట్లుగా త్రివిక్రమ్‌ చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు అదే దారిలో రామ్‌ చరణ్‌ కూడా సిక్స్‌ ప్యాక్‌తో కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. రంగస్థలం చిత్రం తర్వాత రామ్‌ చరణ్‌ చేస్తున్న సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. రాజ వంశం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ రాజవంశస్తుడిగా కనిపించబోతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.

బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో రామ్‌ చరణ్‌ సిక్స్‌ ప్యాక్‌తో కనిపించబోతున్నట్లుగా సినీ వర్గాల్లో సమాచారం అందుతుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్‌ జరుగుతుంది. సిక్స్‌ ప్యాక్‌తో గతంలో ఒక సినిమాలో రామ్‌ చరణ్‌ కనిపించే ప్రయత్నం చేశాడు. కాని అది పూర్తి స్థాయిలో సక్సెస్‌ కాలేదు. కాని ఈసారి సిక్స్‌ ప్యాక్‌తో చాలా సీన్స్‌లో రామ్‌ చరణ్‌ కనిపిస్తాడని సినీ వర్గాల వారు అంటున్నారు. ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌లు ఒకేసారి సిక్స్‌ ప్యాక్‌ చేయడం ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది. ఇద్దరు కూడా త్వరలో రాజమౌళి దర్శకత్వంలో నటించబోతున్నారు. అంటే ఆ మల్టీస్టారర్‌లో ఇద్దరు కూడా సిక్స్‌ ప్యాక్‌తో కనిపించబోతున్నారన్నమాట. జక్కన్న సినిమా కోసమే ఇద్దరు కూడా సిక్స్‌ ప్యాక్‌ చేశారని, అయితే ముందే వారు నటిస్తున్న సినిమాల్లో దాన్ని చూపించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ముందు సినిమాల్లోనే ఇలా ఉంటే ఇక తర్వాత రాబోతున్న జక్కన్న మూవీలో ఏ స్థాయిలో వీరిద్దరు కండలు చూపిస్తారో అంటూ ప్రచారం జరుగుతుంది.