ఎన్టీఆర్‌ బయోపిక్‌… మేం చెప్పినట్లే!!

Balakrishna may Directed NTR Biopic movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా తీసుకుని మొదలు పెట్టిన చిత్రం ‘ఎన్టీఆర్‌’. ఈ చిత్రానికి మొదట తేజ అనుకున్నారు. ఆ తర్వాత ఆయన్ను తప్పించినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజం కాదని సినిమా ప్రారంభోత్సవం సందర్బంగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెప్పుకొచ్చారు. తాజాగా చిత్రం నుండి తాను తప్పుకుంటున్నట్లుగా స్వయంగా తేజ ప్రకటించడంతో ఎన్టీఆర్‌ చత్రంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. మొత్తానికి ఎన్టీఆర్‌ చిత్రం అసలు ఉంటుందా ఉండదా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేశారు. అయితే మేం మాత్రం రాఘవేంద్ర రావు, క్రిష్‌ దర్శకత్వ పర్యవేక్షణలో బాలకృష్ణ స్వయంగా ‘ఎన్టీఆర్‌’ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్లుగా చెప్పాం.

తాజాగా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌ చిత్రానికి తానే దర్శకత్వం వహించాలనే నిర్ణయానికి వచ్చాడు. త్వరలోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేసేందుకు కూడా సిద్దం అవుతున్నారు. సినిమా ముగ్గురు భాగస్వామ్యులుగా నిర్మిస్తున్నారు. అందులో బాలకృష్ణ షేర్‌ ఎక్కువ కనుక ఆయన నిర్ణయం ఫైనల్‌ అని, బాలయ్య తానే దర్శకత్వం వహించాలనే నిర్ణయానికి వచ్చాడు అంటూ ప్రచారం జరుగుతుంది. గతంలో బాలకృష్ణతో క్రిష్‌ వర్క్‌ చేశాడు. ఆ సన్నిహిత్యంతో ఎన్టీఆర్‌ చిత్రంకు దర్శకత్వ పర్యవేక్షణ చేసేందుకు ఓకే చెప్పాడు. ఇక రాఘవేంద్ర రావు కూడా ఎన్టీఆర్‌ బయోపిక్‌ కోసం తన వంతు సాయం చేస్తాను అంటూ ప్రకటించాడట. దాంతో వారిద్దరి దర్శకత్వ పర్యవేక్షణలో బాలకృష్ణ ‘ఎన్టీఆర్‌’ చిత్రాన్ని తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడు.