బ్రహ్మీ టైం అయిపోయింది

Brahmanandam Movie Industry Career may closed

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కొన్ని సంవత్సరాల ముందు సినిమాలో బ్రహ్మానందం ఉన్నాడు అంటే ఆ సినిమా సగం సక్సెస్‌ అయినట్లే అనుకునేవారు. బ్రహ్మానందం వల్ల ఎన్నో చిత్రాలు సూపర్‌ హిట్‌ అయ్యాయి. సూపర్‌ స్టార్స్‌కు కూడా బ్రహ్మానందం వల్ల కలిసి వచ్చి పలు సక్సెస్‌లు దక్కించుకున్నాయి. మహేష్‌బాబు బిగ్గెస్ట్‌ సక్సెస్‌ చిత్రాల్లో ఒక్కటైన దూకుడు చిత్రం సక్సెస్‌ క్రెడిట్‌ ఎక్కువగా బ్రహ్మానందంకు దక్కుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి బ్రహ్మానందం గత కొంత కాలంగా సక్సెస్‌లు లేక ఢీల పడిపోయాడు. చేస్తున్న ఏ ఒక్క సినిమా కూడా మెప్పించలేక పోవడంతో పాటు, కనీసం తన పాత్రతో నవ్వించలేక పోతున్నాడు.

తాజాగా ఎన్నో అంచనాల నడుమ తెరకెక్కిన ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రంలో బ్రహ్మానందం కీలక పాత్ర పోషించాడు. గతంలో మంచు విష్ణు మరియు బ్రహ్మానందంల కాంబోలో వచ్చిన ‘దేనికైనా రెడ్డి’, ‘దూకుకెళ్తా’ చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే ఈ చిత్రం కూడా తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకం అందరిలో కలిగింది. కాని షాకింగ్‌గా బ్రహ్మానందం రొటీన్‌ కామెడీతో ప్రేక్షకులను నవ్వించకపోగా, చిరాకు కలిగేలా చేసింది. బ్రహ్మానందం మరోసారి ఫెయిల్‌ అవ్వడంతో ఇక ఆయన కెరీర్‌ ఖతం అయినట్లే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు మూడు సంవత్సరాలుగా చేసిన ప్రతి సినిమా కూడా ఫ్లాప్‌ అవుతున్న నేపథ్యంలో బ్రహ్మానందం ఇక సినిమాలకు దూరంగా ఉండటం మంచిదనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది.