రేపటి నుంచి ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్.

Balakrishna NTR Biopic Movie Shooting On Tomorrow

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఎన్టీఆర్ బయోపిక్ గురించి ఎంత హడావిడి జరిగిందో అంత సైలెంట్ గా రేపటి నుంచి ఆ సినిమా షూటింగ్ మొదలు కాబోతోంది. బాలయ్య హీరోగా తేజ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా తొలి షాట్ కి రేపు రామకృష్ణ స్టూడియోస్ లో శ్రీకారం చుడుతున్నారు. ఈ సినిమాకు సాయి కొర్రపాటి, ఇందూరి విష్ణుతో పాటు హీరో బాలకృష్ణ కూడా ఓ నిర్మాతగా వ్యవహరిస్తారు. రేపు టీజర్ కి అవసరమయ్యే షాట్స్ చిత్రీకరిస్తారని తెలుస్తోంది.

సడన్ గా ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ అన్న విషయం సంచలనమే. ఎప్పుడైతే బాలయ్య, తేజ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తానని ప్రకటించారో అప్పుడే రచ్చ మొదలైంది. దీనికి కౌంటర్ అన్నట్టు వర్మ తాను “లక్ష్మీస్ ఎన్టీఆర్” చేస్తున్నట్టు ప్రకటించారు. ఎన్టీఆర్ బయోపిక్ అనగానే ఎన్నో విమర్శలు చేసిన లక్ష్మీపార్వతి “లక్ష్మీస్ ఎన్టీఆర్ “ ప్రకటన రాగానే సైలెంట్ అయిపోయారు. దీంతో ఈ సినిమాల పోటీ కాస్త రాజకీయ రచ్చగా మారింది. “లక్ష్మీస్ వీరగ్రంధం “ సినిమా ప్రకటన రాగానే సీన్ అంతా అటు షిఫ్ట్ అయ్యింది. ఆ సినిమా డైరెక్టర్ కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, లక్ష్మీపార్వతి మధ్య విమర్శలు తారాస్థాయికి చేరాయి. కానీ ఉన్నట్టుండి ఆ గొడవ ఆగిపోయింది. దీంతో ఆ సినిమాలు షూటింగ్ దాకా వెళ్లకుండా ఒప్పందం కుదిరిందని ఓ టాక్. దానికి తగ్గట్టే “లక్ష్మీస్ ఎన్టీఆర్” ప్రకటించిన వర్మ నాగ్ సినిమాతో పాటు, కడప వెబ్ సిరీస్ పనిలో పడ్డాడు. అటు “లక్ష్మీస్ వీరగ్రంధం “ తీస్తానన్న కేతిరెడ్డి చెన్నై వెళ్లి ఆర్కే నగర్ తీర్పు మీద ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఈ ఇద్దరూ సైలెంట్ కాగానే అంతకన్నా సైలెంట్ గా ఎన్టీఆర్ బయోపిక్ మొదలు పెడుతున్నారు బాలయ్య, తేజ.