ఒక్క క్షణం ప్రివ్యూ…

Okka-Kshanam preview

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు : అల్లు శిరీష్, సురభి, సీరత్ కపూర్, అవసరాల శ్రీనివాస్ 
నిర్మాత:  చక్రి చిరుగుపాటి
దర్శకత్వం :   వి ఐ ఆనంద్
మ్యూజిక్ : మణిశర్మ

అల్లు శిరీష్‌ హీరోగా సురభి హీరోయిన్‌గా వి ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఒక్క క్షణం’. ఇప్పటికే విడుదలైన టీజర్‌ మరియు ట్రైలర్‌లు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ చిత్రంపై మొన్నటి వరకు పెద్దగా ఆసక్తి లేదు. అయితే ఎప్పుడైతే టీజర్‌ మరియు ట్రైలర్‌ విడుదల అయ్యిందో అప్పటి నుండి కూడా సినిమాలో ఏదో మ్యాటర్‌ ఉందని సినీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు కూడా ఆసక్తిని కనబర్చుతున్నారు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రంతో దర్శకుడిగా విమర్శల ప్రశంసలు దక్కించుకున్న వి ఆనంద్‌ ఈ చిత్రంతో మరోసారి సక్సెస్‌ను దక్కించుకోవడం ఖాయం అంటూ ట్రైలర్‌ను చూస్తుంటే అనిపిస్తుంది. 

భారీ స్థాయిలో అంచనాలున్న ‘ఒక్క క్షణం’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గత వారం విడుదలైన ఎంసీఏ మరియు హలో చిత్రాలు యావరేజ్‌ టాక్‌ను దక్కించుకున్నాయి. ఆ కారణంగా ‘ఒక్క క్షణం’ చిత్రంకు మంచి ఛాన్స్‌ ఉంది. కాస్త పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్నా కూడా మంచి కలెక్షన్స్‌ను రాబట్టే అవకాశం ఉందని టాక్‌ వినిపస్తుంది. ఇప్పటి వరకు కమర్షియల్‌గా బిగ్‌ సక్సెస్‌ను అందుకోలేక పోయిన అల్లు శిరీష్‌ ఈ చిత్రంతో అయినా కమర్షియల్‌ హీరోగా పేరు తెచ్చుకుంటాడా అనేది చూడాలి. ఈ చిత్రం సక్సెస్‌ అవ్వాలని మెగా ఫ్యామిలీ హీరోలు తెగ ప్రమోషన్‌లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్‌ తమ్ముడి కోసం చాలా పాటు పడుతున్నాడు. మరి కొన్ని గంటల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా రివ్యూ కోసం చూస్తూనే ఉండండి.