పాట, ట్రైలర్‌ ఒకేసారి అంటున్న ‘అజ్ఞాతవాసి’

agnathavasi kodaka koteswara rao song and trailer release date fix

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవన్‌ ‘అజ్ఞాతవాసి’ ట్రైలర్‌ కోసం ఫ్యాన్స్‌ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సహజంగా ఆడియో విడుదల సందర్బంగా ట్రైలర్‌ను విడుదల చేస్తారు. అయితే సినిమా ప్రమోషన్‌ వ్యూహంలో భాగంగా దర్శకుడు త్రివిక్రమ్‌ ట్రైలర్‌ విడుదలను వాయిదా వేస్తున్నాడు. క్రిస్మస్‌ సందర్బంగా ట్రైలర్‌ను విడుదల చేసే అవకాశం ఉందని భావించారు. ఆ తర్వాత ఇప్పుడు కొత్త సంవత్సరం కానుకగా అంటున్నారు. క్రిస్మస్‌ తర్వాత రోజు విడుదల అయ్యే అవకాశాలున్నాయని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. కాని దర్శకుడు త్రివిక్రమ్‌ మరోసారి నిరాశ పర్చాడు. కొత్త సంవత్సరం కానుకగా ఇప్పటికే కొడుకా కోటేశ్వరరావు.. అంటూ ఒక పాటను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. 

pawan
ఆ పాటతో పాటు ట్రైలర్‌ను విడుదల చేసే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. డిసెంబర్‌ 31న పవన్‌ పాడిన ప్రత్యేక పాటను విడుదల చేయబోతుండగా, కొత్త సంవత్సరం కానుకగా అంటే జనవరి 1న ట్రైలర్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. సినిమాను సంక్రాంతి సందర్బంగా జనవరి 10న విడుదల చేయబోతున్నారు. అందుకే ట్రైలర్‌ ఖచ్చితంగా మొదటి తారీకున విడుదల చేసి తీరుతారు అంటూ సమాచారం అందుతుంది. కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా అను ఎమాన్యూల్‌ మరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఓవర్సీస్‌లో ఈ చిత్రం రికార్డు స్థాయిలో విడుదల అవ్వనున్న నేపథ్యంలో ఈజీగా అయిదు మిలియన్‌ డాలర్లను వసూళ్లు చేస్తుందనే నమ్మకంతో ట్రేడ్‌ వర్గాల వారు ఉన్నారు.

పాట, ట్రైలర్‌ ఒకేసారి అంటున్న ‘అజ్ఞాతవాసి’ - Telugu Bullet