అఖిల్‌ 3వ చిత్రం… కొత్త వార్త

Akhil To Do Next Movie with Atlee Direction

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అక్కినేని ప్రిన్స్‌ అఖిల్‌ మొదటి చిత్రం ‘అఖిల్‌’ నిరాశ పర్చడంతో దాదాపు రెండు సంవత్సరాలు గ్యాప్‌ తీసుకుని ‘హలో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చాలా గ్యాప్‌ తీసుకుని చేసినా కూడా ‘హలో’ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. దాంతో మూడవ సినిమాకు ఏమాత్రం ఆలస్యం చేయవద్దని అఖిల్‌ భావిస్తున్నాడు. ఇప్పటికే అఖిల్‌ మూడవ చిత్ర దర్శకుల జాబితాలో సుకుమార్‌, కొరటాల శివ మరియు హను రాఘవపూడిలు ఉన్నారు. ఈ ముగ్గురు కాకుండా తాజాగా మరో దర్శకుడు కూడా ఈ జాబితాలో చేరాడు. ఈ దర్శకుల్లో ఎవరితో అఖిల్‌ చిత్రం చేయబోతున్నాడు అనే విషయంపై వచ్చే నెలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

అఖిల్‌ మూడవ చిత్ర బాధ్యతలను ‘మెర్సల్‌’ దర్శకుడు అట్లీ కుమార్‌కు అప్పగించే యోచనలో అక్కినేని నాగార్జున ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. తమిళంలో సూపర్‌ హిట్స్‌ అందించిన యువ దర్శకుడు అట్లీతో ఆ మద్య మహేష్‌బాబు ఒక చిత్రం చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మహేష్‌బాబు మాత్రమే కాకుండా ప్రభాస్‌ కూడా అట్లీ దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తిగా ఉన్నాడు అంటూ ప్రచారం జరిగింది. తాజాగా అఖిల్‌ హీరోగా అట్లీ కుమార్‌ దర్శకత్వంలో సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజం ఎంత అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. వచ్చే నెల అంటే జనవరి 10న సంక్రాంతి సందర్బంగా అక్కినేని అఖిల్‌ మూడవ చిత్రంను ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తోంది.