హీరోయిన్‌ కంటే ఎక్కువే!

Ramya Krishna Remuneration for Sailaja Reddy Alludu Movie

‘బాహుబలి’ చిత్రంలో శివగామిగా నటించిన రమ్యకృష్ణ సౌత్‌తో పాటు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకున్న విషయం తెల్సిందే. బాహుబలికి ముందు రమ్యకృష్ణ పారితోషికంతో పోల్చితే బాహుబలి తర్వాత పారితోషికం డబుల్‌ అయ్యింది. ప్రస్తుతం తెలుగులో ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రంలో ఒక కీలక పాత్రను పోషిస్తున్న రమ్యకృష్ణ పారితోషికం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. శైలజ రెడ్డి అల్లుడు చిత్రంలో హీరోగా నాగచైతన్య నటిస్తుండగా, హీరోయిన్‌గా అను ఎమాన్యూల్‌ నటిస్తుంది. ఈ చిత్రంలో నటిస్తున్నందుకు హీరోయిన్‌ అను ఎమాన్యూల్‌కు 75 లక్షల పారితోషికం ఇస్తున్నారు. అయితే రమ్యకృష్ణకు మాత్రం ఏకంగా డబుల్‌ పారితోషికం ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.

‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రంలో శైలజ రెడ్డిగా రమ్యకృష్ణ నటిస్తున్న విషయం తెల్సిందే. రమ్యకృష్ణతో కేవలం 25 రోజులు మాత్రమే దర్శకుడు మారుతి చిత్రీకరణ జరుపుతున్నాడు. 25 రోజులకు గాను రోజుకు 6 లక్షల చొప్పున పారితోషికం ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఏకంగా రమ్యకృష్ణకు కోటిన్నర పారితోషికంను ఇస్తున్నారు. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ అయితేనే బాగుంటుందనే అభిప్రాయంతో రమ్యకృష్ణను సంప్రదించడం, ఆమె భారీ పారితోషికం డిమాండ్‌ చేయడంతో పర్వాలేదు అని ఆమె అడిగిన పారితోషికం ఇచ్చి మరీ నటింపజేస్తున్నారు. పక్కా ప్రణాళికతో ఈ చిత్రంను చిత్రీకరిస్తున్న దర్శకుడు మారుతి ఈ చిత్రం కోసం రమ్యకృష్ణ నుండి కేవం 25 రోజుల డేట్లు మాత్రమే తీసుకున్నాడు. 25 రోజులకు భారీ పారితోషికం అందుకుంటున్న రమ్యకృష్ణ ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచాడు.