ఏమున్నాడ్రా బాబు.. చైతూ గురించి అఖిల్‌!!

Akkineni Akhil Majnu Movie Updates

నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది. ఈనెల 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకను చిత్ర యూనిట్‌ సభ్యులు నిర్వహించారు. ఈ వేడుకలో చిత్ర యూనిట్‌ సభ్యులతో పాటు ముఖ్య అతిథులుగా నాగార్జున, నాని, అఖిల్‌లు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు సినిమా సక్సెస్‌ కావాలని కోరుకుంటూ విషెష్‌ చెప్పారు. అయితే తక్కువ మాట్లాడే అఖిల్‌ మాత్రం ఈసారి కాస్త ఎక్కువ మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించాడు. అన్న చైతూపై తనకు ఉన్న వాత్సల్యంను ప్రదర్శించి అన్నదమ్ముల మద్య ఎలాంటి అన్యోన్యత ఉందో చెప్పకనే చెప్పాడు.

Shailaja Reddy Alludu Pre Release Event

‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో అఖిల్‌ మాట్లాడుతూ.. నాకు స్టేజ్‌పై మాట్లాడటం అంటే కాస్త మొహమాటం. అందుకే ఎక్కువగా నేను స్టేజ్‌పై మాట్లాడలేక పోతాను. కాని ఈరోజు మాత్రం చాలా మాట్లాడాలనుకుంటున్నాను. అన్న గురించి మాటలు తనుకు వస్తున్నాయి. అన్న ఈమద్య పెళ్లి చేసుకుని అల్లుడు అయ్యాడు. సరైన సమయంలో ఈ చిత్రంకు అన్నను మారుతి బుక్‌ చేశాడు. ఈమద్య పెళ్లి అయిన కారణంగానో ఏమో కాని అన్న ఫేస్‌లో గ్లో బాగా కనిపిస్తుంది. నాకే అన్న ఏమున్నాడ్రా అనిపిస్తున్నాడు. ఆ గ్లో ఈ సినిమాకు తప్పకుండా ఉపయోగపడుతుందనే అభిప్రాయంను అఖిల్‌ వ్యక్తం చేశాడు. అఖిల్‌ మాటలకు అక్కినేని ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేశారు. అన్నదమ్ము మద్య ఉన్న అన్యోన్యంతో సినీ వర్గాల వారు కూడా ముచ్చట పడుతున్నారు.