సబ్బం హరి రీ ఎంట్రీ పక్కా…పార్టీ కూడా ఫిక్స్…!

Sabbam Hari Re-Entry In Politics
సుమారు నాలుగేళ్ల నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న అనకాపల్లి మాజీ ఎంపి సబ్బం హరి తన పొలిటికల్ రీ ఎంట్రీ త్వరలోనే ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం రోలుగుంట మండలం కంచుగుమ్మల పంచాయతీ శివారు భోగాపురంలో తన అభిమానులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హరి మాట్లాడారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం సరైందని కాదని తాను మొదట్లోనే వ్యతిరేకించానన్నారు. అందుకు పర్యావసనం 2014 ఎన్నికలో ప్రజల నిర్ణయాన్ని కాంగ్రెస్‌ ఎదుర్కొనాల్సి వచ్చిందని అన్నారు.
sabbam-hari-ex
ఏపీలో బీజేపీ ఉనికే లేదని, కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేసిన అన్యాయం, మోసాల గురించి ప్రజలకు వివరించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నూటికి నూరుశాతం సఫలమయ్యారన్నారు. 2019లో జరిగే ఎన్నికల్లో తాను తప్పకుండా పోటీ చేస్తానని సబ్బం హరి వెల్లడించారు. అయితే తాను ఏ పార్టీ తరపున పోటీ చేస్తాననేది త్వరలోనే తెలియజేస్తానన్నారు. అయితే అంతకంటే ముందు రెండు నెలలపాటు జిల్లా అంతటా పర్యటించి, తన అభిమానులతో సమావేశాలు నిర్వహిస్తానని సబ్బం హరి తెలిపారు. ఆ తరువాతే ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకుని వెల్లడిస్తానన్నారు. అయితే గత కొద్దిరోజులుగా ఆయన టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారని వార్తలు వచ్చిన నేపధ్యంలో ఆయన వాటిని ఖండించ లేదు, సో ఇక ఆయన సైకిల్ ఎక్కడం లాంచనమే అని విశ్లేషకులు భావిస్తున్నారు.
pabban-hari-ex