త్రివిక్రమ్ ఎట్టకేలకు ఫినిష్ చేశాడు

త్రివిక్రమ్ శ్రీనివాస్ గతంలో స్టైలిష్ స్టార్ అల్లు ఆర్జున్ తో జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి వంటి బ్లాక్ బస్టర్ హిట్ట్ ను అందించాడు. బన్నీ కోసం హట్రిక్ విజయాన్ని అందించాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు. బన్నీకూడా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ప్లాప్ తో దాదాపుగా వన్ ఇయర్ నుండి సినిమాలకు దూరంగా ఉన్నాడు. మంచి వివిధ్యమైన కథకోసం ఎదురుచూస్తున్నాడు. ఈ నేపద్యంలోనే విక్రం కె కుమార్ కూడా బన్నీకి ఓ కథను వినిపించాడు కానీ కొన్ని అనివార్యకారణాల వలన ఆ కథను పక్కన పెట్టాడు. అరవింద సమేత సినిమా విజయంతో మంచి జోష్ మిధ ఉన్న త్రివిక్రమ్ బన్నీని కలిసి నెక్స్ట్ సినిమాకు సంబందించిన ఓ స్టొరీ లైన్ ను వినిపించాడు. బన్నీకి బాగా నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ ను సిద్దం చెయ్యమన్నాడు.

త్రివిక్రమ్ పూర్తి స్క్రిప్ట్ సిద్దం చేసేపనిలో బిజీగా ఉన్నాడు. ఈ మద్యనే స్క్రిప్ట్ పూర్తి అవ్వడంతో మరోసారి బన్నీకి పూర్తి కథను వినిపించాడు. కానీ కథలో కొన్ని మార్పులు చేర్పులు చెయ్యవలసిందిగా బన్నీ సూచించాడు. అందుకు సంబందించిన కథపైన త్రివిక్రమ్ మరోసారి కసరత్తు చేస్తున్నాడు. త్వరలోనే బన్నీతో సినిమాను అనౌన్స్ చెయ్యాలని అనుకుంటున్నాడు. ఇప్పటికే ఆలస్యం అవుతూ వస్తున్నా బన్నీ – త్రివిక్రమ్ సినిమా అసలు ఉంటుందా లేదా అనే సందేహం అల్లు ఫాన్స్ ని ఆలోచనలోకి నెట్టేస్తుంది. బన్నీకి ఓ సాలిడ్ హిట్ట్ ఇవ్వాలని త్రివిక్రమ్ దృడసంకల్పంతో ఉన్నాడు.