పెట్టా టీజర్…అభిమానులకి పండగే !

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నేడు కొత్త వసంతంలో అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా సందడి మామూలుగా ఉండదు కదా అందుకే ఈ వేడుకలు ఘనంగా జరిపేందుకు వారంతా సిద్ధమై పోయారు. అయితే తాను ఈ ఏడాది పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటానని, అభిమానులు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని రజనీ పిలుపునిచ్చారు. తన నిర్ణయం నిరాశ పరిస్తే మన్నించాలని కోరారు. ఇటీవల గజ తుపాను తమిళనాడు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. దాని ప్రభావం నుంచి బాధితులు ఇంకా కోలుకోలేదు. విధ్వంసం సృష్టించిన గజ తుపాను బాధితులను ఆదుకోవాలని తన నూతన సినిమా ఆడియో విడుదల సందర్భంగా పిలుపునిచ్చిన ఆయన పుట్టిన రోజు సందర్భంగా తన నివాసానికి రావద్దని అందరికీ విజ్ఞప్తి చేశారు. తన నిర్ణయం నిరాశపరిచి ఉంటే క్షమించాలని కోరారు.

అందులో భాగంగానే వేడుకలకు దూరమైనట్లు తెలిసింది. మరోపక్క రజనీకాంత్ కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ‘పెట్టా’ సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ రోజున రజనీకాంత్ పుట్టినరోజు కావడంతో, అభిమానులలో సంతోషాన్ని రేకెత్తించడానికిగాను ‘పెట్టా’ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ‘పెట్టా’ టీమ్ వారు రజనీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్లో రజనీ మోడ్రన్ గాను సంప్రదాయ దుస్తుల్లోను డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తున్నారు. యూత్ తో కలిసి ఆయన స్టెప్పులు వేయడం అందరూ విందు చేస్తూ ఆయనను ఆశీర్వదించడం వంటి దృశ్యాలపై ఈ టీజర్ ను కట్ చేశారు. అంటే ఆయన పుట్టినరోజు సందర్భానికి తగినట్టుగా వుండే టీజర్ నే సన్ పిక్చర్స్ వారు వదిలారన్న మాట. ఈ సినిమాలో సిమ్రాన్ త్రిష కథానాయికలుగా కనిపించనున్నారనే సంగతి తెలిసిందే. మీరు కూడా పెట్టా టీజర్ చూసేయండి మరి