OTT లో “జవాన్” కి ఘన విజయం

OTT లో
Cinema News

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా దీపికా పదుకోన్ అలాగే నయనతార లు హీరోయిన్స్ గా దర్శకుడు అట్లీ తెరకెక్కించిన సెన్సేషనల్ హిట్ సినిమా “జవాన్”. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చి షారుఖ్ కెరీర్లోనే మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా రీసెంట్ గానే ఓటీటీ లో కూడా రిలీజ్ అయ్యింది. మరి నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాగా మొదటి వీకెండ్ లోనే రికార్డ్ బ్రేకింగ్ రెస్పాన్స్ ఈ మూవీ సొంతం చేసుకుంది.

OTT లో "జవాన్" కి ఘన విజయం
Shah Rukh Khan

ఇక ఇప్పుడు అయితే 11 రోజుల్లో ఏకంగా 25.5 మిలియన్ వ్యూస్ ని నెట్ ఫ్లిక్స్ లో జవాన్ నమోదు చేసినట్టుగా తెలుస్తుంది . దీనితో ఓటీటీ లో మాత్రం మన RRR తర్వాత ఈ సినిమా నే హైయెస్ట్ వ్యూస్ తో ఇప్పుడు దూసుకెళ్తుంది. ఇక ఈ భారీ సినిమా కి అనిరుద్ సంగీతం అందించాడు అలాగే గౌరి ఖాన్ ఈ సినిమా ని నిర్మాణం వహించారు.