‘ఎన్టీఆర్’ నుంచి ‘రాజర్షి’ సాంగ్ విడుదల

rajasri song released in ntr biopic

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథపై ఆయన తనయుడు బాలకృష్ణ నటిస్తూ నిర్మిస్తున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్‌ మూవీపై టాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు. మహానటుడు రామారావు జీవితాన్ని ఒకే సినిమాలో చూపించడం సాధ్యం కాదు కాబట్టి..ఎన్టీఆర్..సినీ ప్రస్థానాన్ని ..‘ఎన్టీఆర్..కథానాయకుడు’ పేరుతో రామారావు ఫస్ట్ టైమ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనవరి 9న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. రీసెంట్‌గా ఈ మూవీ నుంచి ‘ఘనకీర్తిసాంధ్ర విజితాఖిలాంధ్ర మణిదీపకా ఓ కథానాయకా’..అంటూ రిలీజ్ చేసిన పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా రోజుల తర్వాత అచ్చమైన తెలుగు పదాలతో రిలీజ్ చేసిన ఈ పాట కథానాయకుడిగా ఎన్టీఆర్ గొప్పతనం ఏంటో తెలిపేలా ఉంది.

ntr biopic movie four hours in theaters

తాజాగా ఈ మూవీలో ‘కృషితో నాస్తి దుర్భిక్షమని లోకాన్ని శాసించు..మనిషివో..ఋషివో..రాజర్షివో అంటూ మరో పాటను విడుదల చేసారు. ఈ పాట కూడా పదహారాణాల అచ్చు తెలుగు పదాలతో కీరవాణి డా.కే.రామకృష్ణ సహాకారంతో ఈ పాటను శివదత్త రాశారు. మరోవైపు జగద్గురు ఆదిశంకరాచార్యుల నిర్వాణ షట్కమ్ నుంచి కొన్ని పదాలను ఈ పాట కోసం వాడుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కంపోజ్ చేసిన ఈ సాంగ్ బాగా ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు. ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు విద్యాబాలన్, రానా దగ్గుబాటి, సుమంత్, నందమూరి కల్యాణ్‌రామ్, రకుల్ ప్రీత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.