“ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా గురించి కొత్త సమాచారం”

Cinema News

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘దేవర సినిమా షూట్ లో ఫుల్ బిజీగా ఉన్నారు . ఈ సినిమా తర్వాత ‘వార్ 2’ కి డేట్స్ ఇచ్చాడని టాక్ నడుస్తుంది. మరోపక్క ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమాకి డేట్స్ ఇచ్చాడని అందరూ అంటున్నారు. ఇంతకీ, ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్’ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? అంటూ తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తు ఉన్నారు . ప్రస్తుతం ప్రశాంత్ నీల్, సలార్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నాడు.

"ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమా గురించి కొత్త సమాచారం"
NTR And Prasanth neel

ఐతే, జనవరి నాలుగో వారం తర్వాత ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రశాంత్ నీల్ స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది . 2025 సమ్మర్ తర్వాత ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్ పైకి వెళ్తోంది అని తెలుస్తోంది. మొత్తానికి ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ సినిమా గురించి నిత్యం ఏదొక రూమర్ వినిపిస్తూనే ఉంది. ఆ మధ్య ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ప్రియాంక చోప్రా నటించబోతుంది అంటూ పుకార్లు వస్తున్నాయి . నిజానికి ఈ సినిమాకు సంబంధించి ఇంకా నటీనటుల ఎంపిక అవ్వలేదు .