స్నేహం కోసం అన్నయ్య మెడపై కత్తి పెట్టుకోవడం నచ్చి, అభిమానిస్తున్నా : శిరీష్

Allu-Arjun-Is-My-Favorite-A

మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన మరో హీరో అల్లు శిరీష్. మొదటి సినిమా గౌరవం తో తన కెరీర్ ను స్టార్ట్ చేశాడు. కానీ ఇప్పటి వరకు హీరోగా చేసినవి నాలుగు సినిమాలు మాత్రమే. వాటిల్లో ఏ ఒక్కటి కూడా తన కెరీర్ కు బ్రేక్ ఇవ్వలేక పోయాయి. ఈయన సినిమా ఏదైనా విడుదలైతే అల్లు ఆర్జున్ తమ్ముడు సినిమా అని చూడటం తప్పా పెద్దగా పేరు కూడా ఏమి లేదు. అన్నయ్య అల్లు ఆర్జున్ సినిమా ఆడియో ఫంక్షన్ కి తప్పకుండా వస్తుంటాడు. చాలా సార్లు ఆడియో ఫంక్షన్ లో నా అభిమాన నటుడు మా అన్నయ్య అల్లు అర్జునే అని చెప్పాడు.

allu-arjun-allu-sirish

తమ్ముడు అల్లు శిరీష్ అన్నయ్యను అంతగా అభిమానిస్తాడు. బన్నీ నటించినా సినిమాలను తప్పకుండ ఫాలో అవ్వుతుంటాడు. తాజాగా మరోసారి శిరీష్ అన్నపై తన అభిమానం ను కనబర్చాడు. గతంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చినా చిత్రం ఆర్య 1, 2 చిత్రాలు నాకు భాగా నచ్చిన చిత్రాలు, అందులో స్నేహం, ప్రేమ, త్యాగం, హీరో పడే తపన నాకు బాగా నచ్చాయి అన్నారు. ఒకానోక్క సందర్బంలో ఫ్రెండ్ అపధలో ఉన్నప్పుడు హీరో తన గొంతు పైన కత్తి పెట్టుకోవడం నాకు బాగా నచ్చింది అన్నారు. అప్పటి నుండి నేను మా అన్నకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను అన్నారు. బన్నీ నటించిన ఆర్య చిత్రం 2009 ఇదే రోజునా విడుదలైంది అందుకే ఈ విషయాన్ని శిరీష్ అభిమానులతో పంచుకున్నాడు.