బాలయ్య కొత్త కంపెనీ, ఇకపై అన్ని అందులోనే..!

Balakrishna registered Brahma Teja Production Banner

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
నందమూరి హీరో కళ్యాణ్‌ రామ్‌ ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌ను స్థాపించి ఇప్పటికే పలు సినిమాలను నిర్మించిన విషయం తెల్సిందే. తాజాగా ఎన్టీఆర్‌తో ‘జైలవకుశ’ చిత్రాన్ని నిర్మించి భారీ లాభాలను దక్కించుకున్నాడు. ఇటీవల పలువురు హీరోలు సొంత బ్యానర్‌ను స్థాపిస్తున్నారు. వారి దారిలోనే నందమూరి బాలకృష్ణ తన కూతుర్ల పేరు మీద బ్రహ్మతేజ అనే ప్రొడక్షన్‌ కంపెనీని ప్రారంభించడం జరిగింది. ఆ బ్యానర్‌లో మొదటి సినిమాగా తన తండ్రి ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను తెరకెక్కించేందుకు సిద్దం అయ్యాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.

ఇటీవలే ఫిల్మ్‌ ఛాంబర్‌లో బ్రహ్మతేజ బ్యానర్‌ను స్వయంగా బాలకృష్ణ రిజిస్ట్రర్‌ చేయించడం జరిగింది. ఇక బ్రహ్మతేజ సంస్థ కోసం ఒక ఆఫీస్‌ను వెదికే పనిలో పడ్డాడు. ప్రస్తుతం బాలయ్య ఉంటున్న ఇంటికి సమీపంలోనే ఆఫీస్‌ ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. బాలయ్య సన్నిహితులు పలు భవనాలను పరిశీలించి మూడు నాలుగు ఫైనల్‌ చేసి బాలయ్యకు సూచించడం జరిగింది. త్వరలోనే బాలయ్య వాటిలోంచి ఒక్కదాన్ని ఫైనల్‌ చేస్తాడు. ఈ సంవత్సరం చివర్లో లేదా వచ్చే సంవత్సరం ఆరంభంలో సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్దం అవుతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. తేజ దర్శకత్వంలో బాలయ్య ఎన్టీఆర్‌ బయోపిక్‌ను చేయబోతున్నాడు. ఇక తన కొడుకు మోక్షజ్ఞ మొదటి సినిమాను కూడా బాలయ్య సొంతంగా నిర్మించబోతున్నాడు. ఆ తర్వాత బోయపాటితో చేయబోతున్న సినిమాను కూడా సొంతంగానే బాలయ్య నిర్మించనున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి వరుసగా తన సినిమానే బాలయ్య నిర్మించబోతున్నాడు.