ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ల మూవీ పుకార్లకు ఫుల్‌స్టాప్‌

trivikram srinivas clarity about ntr movie story

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో ఒక సినిమా ప్రారంభం అయిన విషయం తెల్సిందే. జనవరి లేదా ఫిబ్రవరిలో సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ‘అజ్ఞాతవాసి’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. పవన్‌ 25వ చిత్రం అయిన ‘అజ్ఞాతవాసి’ ఈ నెల చివర్లో పూర్తి కాబోతుంది. సినిమాకు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ వచ్చే నెలలో ముగియనుంది. ఆ వెంటనే ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్‌ సినిమా మొదలు అయ్యే అవకాశాలున్నాయి. ఇక సినిమాకు సంబంధించిన ఒక వార్త గత మూడు నాలుగు రోజులుగా సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఈ చిత్రంను ఒక నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నాడని, దాదాపు కోటి రూపాయలు పెట్టి నవల రైట్స్‌ను త్రివిక్రమ్‌ తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

director-trivikram

కథ గురించి మీడియాలో వస్తున్న వార్తలపై త్రివిక్రమ్‌ క్లారిటీ ఇచ్చాడు. నేడు త్రివిక్రమ్‌ పుట్టిన రోజు. ఈ సందర్బంగా జాతీయ మీడియాతో త్రివిక్రమ్‌ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ సినిమా గురించి వస్తున్న వార్తలనపై స్పందించాడు. ఎన్టీఆర్‌ కోసం నవల రైట్స్‌ తీసుకున్నట్లుగా వస్తున్న వార్తలు అవాస్తవం అని, అసలు తాను ఏ నవల ఆధారంగా కథను రెడీ చేయలేదని, తన గత చిత్రాల మాదిరిగానే సొంతంగా తన టీంతో కథను సిద్దం చేశాను అంటూ చెప్పుకొచ్చాడు. తన గత చిత్రాల మాదిరిగా కుటుంబం అంతా కూడా కలిసి కూర్చుని చూసే విధంగా ఉంటుంది అంటూ త్రివిక్రమ్‌ చెప్పుకొచ్చాడు. ఇక ఈ చిత్రంలో టబు నటించబోతుంది అంటూ వస్తున్న వార్తలపై స్పందిస్తూ, ఆమెను సంప్రదించిన మాట వాస్తవమే కాని, ఇంకా ఫైనల్‌ చేయలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఒక మంచి సినిమాను ఎన్టీఆర్‌ అభిమానులకు ఇస్తాను అంటూ త్రివిక్రమ్‌ చెప్పుకొచ్చాడు.