“దేవర” ఆడియోని దక్కించుకున్న..దిగ్గజ సంస్థ..?

“దేవర” ఆడియోని దక్కించుకున్న..దిగ్గజ సంస్థ..?
Cinema News

గ్లోబల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ మూవీ “దేవర పార్ట్ 1” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ మూవీ నుంచి మేకర్స్ అవైటెడ్ ట్రీట్ గ్లింప్స్ ను రేపు విడుదల చేస్తుండగా దీనిపై సెన్సేషనల్ హైప్ ఇప్పుడు నెలకొంది.

ఇక ఈ సినిమా కి ఉన్న పలు బిగ్గెస్ట్ ఎసెట్స్ లో అనిరుద్ సంగీతం కూడా చాలా మందిని ఎగ్జైట్ చేసింది. మూవీ సాంగ్స్ మ్యూజిక్ ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ దీనిపై ఒక సాలిడ్ అప్డేట్ ఇప్పుడు అందించారు.

“దేవర” ఆడియోని దక్కించుకున్న..దిగ్గజ సంస్థ..?
Devara Movie

దేవర ఆడియో హక్కులని అయితే ప్రముఖ మ్యూజిక్ లేబుల్ బాలీవుడ్ దిగ్గజ సంస్థ అయినటువంటి టి సిరీస్ వారు సొంతం చేసుకున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. మరి దీనిపై టి సిరీస్ వారు ఎగ్జైటింగ్ పోస్ట్ ని కూడా పెట్టారు.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమా దేవర తో కొలాబరేట్ కావడం మాకు గర్వంగా ఉందని క్రేజీ పోస్టర్ తో ఈ సాలిడ్ అప్డేట్ ని అందించారు. మరి అనిరుద్ ఇచ్చే మ్యూజిక్ ఈ చిత్రానికి ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి.