Crime: స్పా సెంటర్లపై పోలీసులు దాడులు.. ఆరుగురు అరెస్ట్

గుడిమల్కా పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్పా సెంటర్లపై పోలీసులు దాడులు చేశారు. పక్కా సమాచారంతో సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, గుడిమల్కా పూర్ పోలీసులు రెండు చోట్ల సోదాలు నిర్వహించారు. ఐదుగురు యువతులతోపాటు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అనుమతి లేని స్పా సెంటర్లు ఎక్కడున్నా ఆ భవన యజమానులు తెలుసుకొని నిర్వాహకులను ఖాళీ చేయించాలని, లేదంటే వారిపైనా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని గుడిమల్కా పూర్ ఇన్స్పెక్టర్ ముజీబ్ రెహ్మాన్ హెచ్చరించారు.