ఎన్టీఆర్ కోసం కోనకి వినాయక్ టెస్ట్ .

V.V Vinayak Test for Kona Venkat over ntr adhurs sequel

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఎన్టీఆర్ ఏ కొత్త సినిమా చేస్తున్నా వాటికి సంబంధించిన ఫంక్షన్స్ లో తరచుగా కనిపించే వారిలో వి.వి.వినాయక్, ఎస్.ఎస్. రాజమౌళి వుంటారు. ఇక వారిని ఎన్టీఆర్ తో సినిమా ఎప్పుడని ఫాన్స్ అడగడం, త్వరలో అని వారు చెప్పడం అలవాటు అయిపోయింది. అయితే ఎప్పటికప్పుడు ఆ మాటలు మాటలుగానే మిగిలిపోతున్నాయి. ఈసారి ఆ మాటల్ని నిజం చేయాలి అనుకుంటున్నారట వినాయక్. ఎప్పటి నుంచో ఆలోచన చేస్తున్న అదుర్స్ సీక్వెల్ గురించి వినాయక్ దృష్టి పెట్టారంట. అదుర్స్ 2 కి సబ్జెక్టు రెడీ చేయమని రచయిత కోన వెంకట్ ని కోరారట. అయితే అదుర్స్ తీసినప్పటికి, ఇప్పటికీ ప్రేక్షకుల టేస్ట్ లో వచ్చిన మార్పులు, తాజాగా ఎన్టీఆర్ చేస్తున్న సినిమాలు కూడా పరిగణనలోకి తీసుకుని సబ్జెక్టు తయారు చేయమని వినాయక్ అడిగినట్టు తెలుస్తోంది.

v-V-vinayak

చేసేది కమర్షియల్ సినిమా అయినప్పటికీ కొత్తదనం లేకుండా రొటీన్ గా తీయడానికి వినాయక్ ఇష్టపడడం లేదట. అందుకే కధలో సమ్ థింగ్ స్పెషల్ వుండాలని రచయిత కోన మీద ఒత్తిడి పెడుతున్నాడట వినాయక్. ఎన్నో సినిమాలకు కధలు అందించిన కోనకి ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా పెద్ద పరీక్షే అవుతోంది.

ntr

ఎన్టీఆర్ కూడా అంతకుముందులా ఏ కథని పడితే ఆ కథని ఓకే చేయడం లేదు. స్టోరీ మీద బాగా కసరత్తు చేస్తున్నాడు. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ దగ్గరికి ఆషామాషీ కథలతో, రొటీన్ కమర్షియల్ సీన్స్ తో వెళితే పని జరిగే అవకాశం లేదు. ఇది కూడా కోన మీద ఒత్తిడి పెంచుతోంది. ఓ వైపు అదుర్స్ సాధించిన విజయం, ఇంకో వైపు ట్రెండ్ కి తగ్గ కొత్త స్టోరీ కోరుకుంటున్న వినాయక్, ఎన్టీఆర్ …ఇన్ని ఒత్తిళ్ల మధ్య అదుర్స్ 2 కి కథ రాయడం కోన వెంకట్ కి నిజమైన పరీక్షే.