దేవర గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్ ?

దేవర గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్ ?
Cinema News

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా ‘దేవర’. ఈ సినిమా పార్ట్ 1 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఏప్రిల్ 5, 2024న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది . ఐతే, జనవరి 8, 2024న ఎన్టీఆర్ అభిమానులకు ఈ చిత్ర యూనిట్ ఒక ట్రీట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది . ఆ రోజున ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేస్తారని టాక్ నడుస్తుంది . మరి ఇప్పటివరకు అయితే ఈ వార్త పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది.

దేవర గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్ ?
Devara Movie

ఈ సినిమా కోసం లెంగ్తీ షెడ్యూళ్లు ప్లాన్ చేస్తున్నాడు కొరటాల. కాబట్టి.. ఈ సినిమా షూట్ వేగంగా జరుగుతుంది. అన్నట్టు ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కూడా అదిరిపోతోందట. అందుకు తగ్గట్టుగానే తన పాత్ర కోసం తారక్ కూడా డిఫరెంట్ మేకోవర్‌ ట్రై చేస్తున్నాడు. మొత్తానికి ఈ సినిమా కోసం కొరటాల కూడా బాగా కసరత్తులు చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.