కాలా పాత్రపై మనసు పడ్డాడు

Balakrishna wants to remake Mafti movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
‘బాషా’ చిత్రంలో రజినీకాంత్‌ మాఫియా డాన్‌గా నటించి బాలీవుడ్‌ హీరోల మతులను కూడా పోగొట్టాడు. రజినీకాంత్‌ దారిలో ఎంతో మంది స్టార్‌ హీరోలు సైతం మాఫియా డాన్‌లుగా నటించేందుకు ఆసక్తి చూపించారు. తాజాగా రజినీకాంత్‌ మరోసారి ‘కాలా’ చిత్రంలో మాఫియా డాన్‌గా కనిపించేందుకు సిద్దం అవుతున్నాడు. ప్రస్తుతం సినిమా విడుదలకు సంబంధించిన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. కబాలి చిత్రంలో మాఫియా డాన్‌గా కనిపించిన రజినీకాంత్‌ పెద్దగా ఆకట్టుకోలేక పోయాడు. ఇప్పుడు ‘కాలా’ చిత్రంతో సక్సెస్‌ను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. మాఫియాడాన్‌ పాత్రపై తాజాగా బాలయ్య కోరిక పెంచుకుంటున్నాడు.

గతంలో డిక్టేటర్‌ చిత్రంలో కాస్త మాఫియా టచ్‌ ఉన్న పాత్రను చేసిన బాలయ్య త్వరలో పూర్తి మాఫియా డాన్‌ పాత్రను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. అందుకోసం గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక రీమేక్‌కు బాలయ్య సిద్దం అయ్యాడు. కన్నడంలో సూపర్‌ హిట్‌ అయిన ‘మఫ్టీ’ చిత్రాన్ని బాలయ్య రీమేక్‌ చేస్తున్నాడు. అందుకు సంబంధించిన రీమేక్‌ రైట్స్‌ను ప్రముఖ నిర్మాత బాలయ్య కోసం కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. బాలయ్యకు మాఫియా డాన్‌గా నటించాలనే కోరిక కలిగిందని, అందుకే ఆ సినిమా రీమేక్‌ చేయాలని ఆశిస్తున్నాడు అంటూ సదరు నిర్మాత మీడియా వద్ద అనధికారికంగా చెప్పుకొచ్చాడు. మాఫియా డాన్‌గా పలువురు స్టార్స్‌ సక్సెస్‌లు సాధించారు. మరి బాలయ్యకు మాఫియా కలిసి వస్తుందేమో చూడాలి.