రకుల్‌కు ఆ అవకాశం ఎప్పటికి రాదు

Kajal Agarwal wants to act with Prabhas

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
చిన్న హీరోలతో కెరీర్‌ను ప్రారంభించిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కొద్ది కాలంలోనే టాలీవుడ్‌ టాప్‌ హీరోలతో సినిమాల్లో నటించింది. వరుసగా పెద్ద హీరోలతో నటించి మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ అనిపించుకుంది. అయితే గత కొంత కాలంగా ఈమెకు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు. పైగా పెద్ద హీరోలు అంతా కూడా ఈమెతో నటించేయడంతో చిన్న హీరోలు కూడా ఈమెతో నటించేందుకు కాస్త ఇబ్బంది పడుతున్నట్లుగా అనిపిస్తుంది. ప్రస్తుతం ఈమె ఒకటి రెండు చిన్నా చితకా చిత్రాలు మినహా పెద్దగా చేస్తున్నది లేదు. భవిష్యత్తులో కూడా ఈమె మళ్లీ పుంజుకుంటుందనే నమ్మకం లేదని సినీ వర్గాల వారు అంటున్నారు.

ఈ సమయంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టార్‌ హీరో ప్రభాస్‌తో నటించాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కోరిక ఎట్టి పరిస్థితుల్లో తీరదని, ఆ ఛాన్స్‌ రకుల్‌కు రాదని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ ‘సాహో’ చిత్రంలో నటిస్తున్నాడు. సాహోలో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్‌ ముద్దుగుమ్మ శ్రద్దా కపూర్‌ నటిస్తుంది. ఆ తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేయబోతున్నాడు. ఆ చిత్రంలో ఇప్పటికే పూజా హెగ్డేను ఎంపిక చేశారు. ఈ రెండు చిత్రాలు పూర్తి అవ్వడానికి చాలా సమయం పడుతుంది. ఆ తర్వాత ప్రభాస్‌ సినిమా కమిట్‌ అయ్యే సమయంకు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ క్రేజ్‌ ఇంకా దిగజారి పోవడం ఖాయం. అందుకే ప్రభాస్‌తో నటించాలనే ఆమె కోరిక తీరే అవకాశం లేదని గట్టిగా చెప్పొచ్చు.