పవన్ కళ్యాణ్ పై బండ్ల గణేష్ కు ఉన్న ప్రేమ

పవన్ కళ్యాణ్ పై బండ్ల గణేష్ కు ఉన్న ప్రేమ

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పక్క రాజకీయాలు మరో పక్క “పింక్” చిత్రం రీమేక్ లో నటిస్తున్న సంగతి బహిర్గతమే అని అందరికి తెలుసు.అయితే పవన్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రాక మునుపు సినీ హీరో అలా చేసిన ఎన్నో సినిమాల ద్వారా ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు.అలాంటి అభిమానుల్లో కల్లా అతి పెద్ద అభిమాని ఎవరు అంటే ప్రముఖ సినీ నటుడు మరియు మాజీ టికాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండ్ల గణేష్ అని చెప్పాలి.

పవన్ పై బండ్ల కు ఉన్న ప్రేమ అంతా ఇంతా ఇంతా పవన్ కోసం బ్లైండ్ గా ఎక్కడి వరకు అయినా వెళ్తారు ఒక్క మాట తాను అనరు పడనివ్వరు.అయితే రాజకీయంగా ఇద్దరి దారులు ఒకప్పుడు వేరయ్యాయి.తాను కూడా ఈ పాలిటిక్స్ లో ఇమడలేకపోయానని ఒప్పుకున్నారు,ఇప్పుడు వీరి దారులు ఒకటవుతాయో లేదో కానీ పవన్ తాను తన పార్టీ నుంచి చెప్పిన మాటలను మాత్రం బండ్ల గణేష్ నిజం అని అంటున్నారు.

అలా పవన్ ఎప్పుడో అన్న మాట ఉన్న జనసేన పోస్టర్ ను ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసారు.అందులో “నేను భయంతో రాలేదు – బాధ్యతతో వచ్చాను” అన్న లైన్ ఉంది.ఈ మాటను “ఇది నిజం” అంటూ పవన్ ను కూడా ట్యాగ్ చేసారు.మరి ఇది కేవలం తన అభిమానం లోని భాగమేనా లేక దూరంగానే ఉండి జనసేన పార్టీకు సపోర్ట్ చేస్తున్నారా అన్నది ఆయనకే తెలియాలి.